బిగ్ బాస్ 7 కు హోస్టింగ్‌గా టీవీ యాంకర్ ఓంకార్ (Anchor Omkar) వ్యవహరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జున (Nagarjuna) మాటనే లెక్కచేయని కంటెస్టెంట్లు ఓంకార్ మాటని వింటారా? అనే సందేహాలు రావచ్చు. కానీ.. కంటెస్టెంట్స్‌ని బట్టి హోస్టింగ్ ఉంటుంది. ఎలాగూ యూట్యూబ్ (Youtube) బ్యాచ్‌లు.. సోషల్ మీడియా సెలబ్రిటీలు.. మహా అయితే టీవీ యాంకర్లు, చిన్న చిన్న నటీనటులే కంటెస్టెంట్స్‌గా వస్తారు కాబట్టి.. వాళ్లకి ఓంకార్ సరిపోతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం మరి.. ఓంకార్ మరి ఈ సీజన్‌కి వచ్చి వన్ సెకండ్ అంటారో లేదంటే.. బెటర్ లక్ నెక్స్ట్ సీజన్ అంటాడో.
ఒక్కటి మాత్రం నిజం.. ఓంకార్ అయితే మాత్రం వింత వింత ఆటలు.. విచిత్ర మైన టాస్క్‌ల (Task )తో వినోదానికి అయితే లోటు ఉండదు. మరీ నాగార్జున మాదిరిగా అయితే ఎవడో చెవిలో చెప్పింది మాత్రం కెమెరా ముందు చదివేసి వెళ్లిపోడని మాత్రం ధీమా చెప్పుచ్చు.ఎవరు తక్కువ తీసుకుంటారే వాళ్లని కంటెస్టెంట్స్ గా తీసుకొస్తున్నారు. ఈ సీజన్ లో ఖతర్ పాప, స్వాతి నాయుడు , అగ్గిపెట్టె మచ్చ, రాకేష్ మాస్టర్ (Rakesh master) ,ఉప్పల్ బాలు లాంటి వాళ్లని తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.కంటెస్టెంట్లు గ్లామర్ డాల్స్ లా ఉంటే కాని యూత్ ని అట్రాక్ట్ చేయలేం. ఈ సారి బిగ్ బాస్ (Big Boss)చూడాలంటే ఓంకార్ అన్నయ్య కాదు కదా…నాగార్జున సార్ కూడా జనాలను తీసుకురాలేరు. బడ్జెట్ పెంచి క్రూ కాస్త పెద్ద పెద్ద యాక్టర్లను తీసుకువస్తే తప్పితే..ఈ బిగ్ బాస్ నెట్టుకురావడం కష్టమే అంటున్నారు జనాలు.