NLR: ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచడంతో ఓ వ్యక్తికి జైలుశిక్ష పడింది. నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన రవుఫ్ తన ఇంటి పెరటిలో 2 గంజాయి మొక్కలు సాగు చేశాడు. 2022 సెప్టెంబర్ 19న అధికారులు దాడి చేసి మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో జిల్లా సెషన్ కోర్టు జడ్జి గీత 3ఏళ్ల జైలు,10వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.