JGL: రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని, ఏఈవో మౌనిక కోరారు. సోమవారం కథలాపూర్ మండలం బొమ్మెన రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం సబ్సిడీపై మొక్కులు అందించడమే కాకుండా, ఎకరానికి రూ. 4,200 సాగు ఖర్చు ఇస్తుందని తెలిపారు. తక్కువ శ్రమతో స్థిరమైన ఆదాయం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.