Rajamouli: స్టైలిష్ లుక్ లో రాజమౌళి..ఎందుకో తెలుసా?
సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli) ప్రముఖ మొబైల్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. అధికారిక ధృవీకరణ కోసం వేచి ఉండగా, రాజమౌళి నటించిన ప్రకటన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది అభిమానులలో సంచలనం సృష్టిస్తోంది.
హీరోలు ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఆ క్రేజ్‌తో భారీ కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఒక్కో హీరో మూడు నుంచి నాలుగు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అంతే కాకుండా ఒక్కో యాడ్‌కు తమకున్న క్రేజ్‌ని బట్టి భారీ స్థాయిలో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు మౌంటైన్ డ్యూ, హెల్త్ ఓకె, పాన్ బహార్, ప్రోటిన్ ఎక్స్, లాయిడ్ తదితర కమర్షియల్ బ్రాండ్లకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. ఇదే తరహాలో అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ కూడా పలు బ్రాండ్లకు ప్రచార కర్తలుగా వ్యవహరించడం తెలిసిందే. అయితే తాజాగా ఈ లీగ్‌లోకి పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి అడుగుపెట్టారు. స్టార్ హీరోలేనా? .. నేను కూడా రెడీ అంటూ రంగంలోకి దిగారు. పాపులర్ మోబైల్ బ్రాండ్ ఒప్పోకు రాజమౌళి(Rajamouli)ప్రచార కర్తగా మారారు. ఇటీవలే సదరు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న జక్కన్న ఇటీవల యాడ్ షూట్ లో పాల్గొన్నారు.
రాజమౌళి యాడ్(add) షూట్(shoot)లో పాల్గొన్న వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతున్నాయి. స్టార్ డైరెక్టర్ రాజమౌళి నటించిన తొలి కమర్షియల్ యాడ్ ఇదే కావడం విశేషం. క్రీమ్ కలర్ బ్లేజర్ ధరించి, రౌండ్ నెక్ టీషర్ట్..మ్యాచింగ్ ప్యాంట్‌తో రాజమౌళి స్టైల్‌గా కనిపిస్తున్న తీరు ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రాజమౌళి స్లైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ కమర్షియల్ యాడ్ ని బాలీవుడ్ డైరెక్టర్ ఫారిన్ లొకేషన్లో చేసినట్టుగా తెలుస్తోంది. ఈ యాడ్‌ని త్వరలోనే విడుదల చేయనున్నారట. త్వరలో సూపర్ స్టార్ మహేష్‌తో రాజమౌళి ఓభారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్న ఈమూవీని ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా లాంఛనంగా ప్రారంభించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియానా జోన్స్ లేదా జేమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమాని తెరపైకి తీసుకురానున్నారు.