AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఈనెల 8 తర్వాత శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. 9వ తేదీ నుంచి TNతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరోవైపు రానున్న 3 రోజుల్లో అల్లూరి, ఏలూరు, ప.గో., NTR, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది.