JGL: కథలాపూర్ మండలం తాండ్యాలలో శ్రీ మల్లిఖార్జున స్వామి బోనాల జాతర భక్తజన సందడిలో ఘనంగా నిర్వహించారు. దేవాలయంలో భక్తులు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. సాయంత్రం భక్తులు బోనాలతో ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు. స్వామివారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.