KNR: మేడిపల్లి మండలం కాచారంలో శ్రీ మల్లిఖార్జున స్వామి బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బోనమెత్తుకొని, భక్తులతో కలిసి దేవాలయం చుట్టూ బోనాలతో తిరిగారు. స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఊరేగింపులో ఒగ్గు కళాకారుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.