TG: తమపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కానీ, మా చిత్త శుద్ధి, మా నిబద్ధత, మా నిజాయితీని అవమానిస్తే ఊరుకునేది లేదు. తోలు తీస్తా అన్న వాళ్ల.. నాలుక కోస్తా. ప్రజల మనసులో ఈ మాటలు రికార్డు చేయడం కోసం ఈ భాష వినియోగిస్తున్నా. మేమంతా ఒక్క మాట మీద ఉండి ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతాం’ అని పేర్కొన్నారు.