తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి 53 వినతులు అందాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సమస్యలను ఆయన స్వీకరించారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్, రెవెన్యూ, పెన్షన్లు, టీటీడీ తదితర శాఖలకు సంబంధించిన వినతులు వచ్చాయన్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని తెలిపారు.