TG: కూటమి పాలనలో నగదు రహిత వైద్య సేవల్లో భారీ పురోగతి నమోదు అయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డా.ఎన్టీఆర్ వైద్య సేవల అమలును, 108, 104 సేవలను వర్చువల్గా అధికారులతో సమీక్షించారు. నిర్దేశిత సమయంలో రోగుల వద్దకు 108 వాహనాలు చేరుకుంటున్నాయని తెలిపారు. 104 వాహనాల ద్వారా త్వరలోనే ఇంటి వద్దనే 41 వైద్య పరీక్షలు అందించనున్నట్లు చెప్పారు.