BPT: అద్దంకి ఆర్టీసీ డిపో నందు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు శనివారం జరిగాయి. ఆర్టీసీ డీఎం బెల్లం రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీఐ సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన వివరించారు.