JDWL: తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అని ఆలయ అర్చకులు తెలిపారు. శనివారం పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు కృష్ణానదీ జలాలతో అమ్మవారికి మంగళస్నానాలు చేయించి, పట్టువస్త్రాలు, విశేష సువర్ణ ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా హోమం, ఆకుపూజలు వైభవంగా నిర్వహించారు.