KRNL: ఆదోనిలోని డా. జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్యాధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ డా. స్వామినాథ్ తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://naipunya.ap.gov.in నమోదు చేసుకోవాలన్నారు.