ADB: నేరడిగొండ మండలంలోని బోరిగాం గ్రామంలో ఇవాళ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతూ లంబాడీలు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా వైభవంగా భక్తిశ్రద్ధలతో భోగ్ భండార్ సమర్పించారు. లంబాడి, బంజారా మహిళలు, పెద్దలు, చిన్నారులు కలిసి ఆధ్యాత్మిక చింతనతో పూజల్లో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ వినేష్ తదితరులున్నారు.