కామారెడ్డి జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షునిగా మహేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిక్కనూరు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను జిల్లా కార్యదర్శులు ఎన్నుకున్నారు. ఎన్నికల అనంతరం మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.