GDWL: చాల కాలం పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన వెంకట నరసయ్య సార్ సేవలు మరువలేనిదని తెలంగాణ టీచర్ యూనియన్ గద్వాల్ జిల్లా అధ్యక్షులు కే. బుచ్చన్న పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రాక్టీసింగ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వెంకట నరసయ్య పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు.