ప్రకాశం: టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఆయన శనివారం (రేపు) ప్రమాణ స్వీకారం చేస్తారని నాయకులు తెలిపారు. ఒంగోలు పట్టణంలోని SGVS కళ్యాణ మండపంలో బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.