VKB: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను ధిక్కరించి వ్యవహరించినందుకు, ధరూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మధులపల్లి ప్రవీణ్ కుమార్, నెనావత్ విజయ్ కుమార్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాన్సింగ్ తెలిపారు. పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా, వారికి వ్యతిరేకంగా పనిచేసినందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.