MBNR: వాహనదారులు తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని ఎస్పీ జానకి సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో భద్రతా నియమాల గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు సూచించే జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.