BHNG: రామన్నపేట మండలం కొమ్మాయిగుడెం గ్రామ అభివృద్ధి, పెండింగ్లో ఉన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆ గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఉదయం హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యేను ఆయన ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.