MDK: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కౌడిపల్లి గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ అన్నారు. గ్రామంలో శుక్రవారం ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించారు. గతంలో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. వేగంగా బిల్లును చెల్లించేందుకు కృషి చేస్తామన్నారు.