KNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘ఉత్తమ సేవా’ పథకానికి ఎస్సై సంధేవేణి శ్రీనివాస్ ఎంపికయ్యారు. గతంలో చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విశేష సేవలు అందించిన ఆయన, ప్రస్తుతం KNR స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో ఆయన కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.