NLG: మున్సిపాలిటీ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. దీని ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధిలోని 18 మున్సిపాలిటీల్లో మొత్తం 6,65,585 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 3,42,873 మంది కాగా, పురుష ఓటర్లు 3,22,617 మంది, ట్రాన్స్ జెండర్లు 95 మంది ఉన్నారు. ఎన్నికలు జరగనున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటేమహిళా ఓటర్లు 20,256 మంది ఎక్కువగా ఉన్నారు.