WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని హన్మకొండలోని ఆయన నివాసంలో గురువారం కాంగ్రెస్ రాష్ట్ర యూత్ నాయకుడు పరిదల నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట డివిజన్ను అభివృద్ధి దిశగా మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం దిశాగా అడుగులు వేయాలన్నారు.