SRD : జిన్నారం మున్సిపల్ కేంద్రంలో గురువారం ఓటర్ ముసాయిదాను జిన్నారం కమిషనర్ తిరుపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయని తెలిపారు. ఓటర్ లిస్టులో అభ్యంతరాలను ఈనెల 5వ తేదీ లోపు రాతపూర్వకంగా సమర్పించాలన్నారు. అభ్యంతరాలు పరిశీలించి మరియు తుది ఓటరు ముసాయిదానం ఈనెల 10న విడుదల చేస్తామని కమిషనర్ తెలిపారు.