PDPL: ధర్మారం మండలం నందిమేడారంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ మేడారం వీర్పాల్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రభుత్వం ఇచ్చిన మందును ప్రతి పశుపోషకుడు సద్వినియోగం చేసుకొని, పశువుల ఆరోగ్యం, ఉత్పత్తి పెంపునకు ఇది చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ ఛైర్మన్ అరిగే లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.