VSP: న్యూ ఇయర్ సందర్భంగా విశాఖలో మద్యం అమ్మకాలు ఊహించిన దానికంటే భారీగా నమోదైయ్యాయి. నిన్న ఒక్క రోజులోనే మద్యం అమ్మకాల ద్వారా రూ. 9.90 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణంగా విశాఖలో రోజుకు రూ.5-6 కోట్ల వరకు ఆదాయం వస్తుంటే.. నిన్న అదనంగా రూ. 3 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. నిన్న, ఈరోజు వైన్స్ షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది.