TPT: ఈ ఏడాది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. 2024లో 12.15కోట్ల లడ్డూలు విక్రయించారు. 2025లో 10 శాతం అధికంగా 13.52 కోట్ల లడ్డూలను భక్తులకు అందించారు. డిసెంబర్ 27న ఒక్కరోజే 5.13 లక్షల లడ్డూలు అమ్ముడుబోయాయి. గత దశాబ్దం కాలంలో ఎక్కువ సంఖ్యలో లడ్డూలు విక్రయించడం ఇదే రికార్డ్.