టాలీవుడ్ నటుడు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ‘డెకాయిట్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఓ కొండపైన షూట్ చేస్తున్నామని, ఇలా న్యూఇయర్ సందర్భంగా కొండపై క్లైమాక్స్ చేయడం హ్యాపీగా ఉందని అడివి శేష్ చెప్పాడు. ఇక షానీల్ డియో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 19న ఇది విడుదలవుతుంది.