జనవరి 1న బ్యాంకులు తెరిచి ఉంటాయా? లేదా? అని చాలా మందికి సందేహం కలుగుతుంది. మిజోరాం, తమిళనాడు, సిక్కిం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఈ ప్రాంతాల వారు తమ బ్యాంకింగ్ పనుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు యథావిధిగా తెరిచి ఉంటాయి.