ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ దేశ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, ఆయురారోగ్యాలు, ఆనందం, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ధృడమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు మన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, దేశ ప్రగతి కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.