మన్యం: సీతానగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారు గురువారం నవనీత అలంకరణలో దర్శనమిస్తున్నారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టడంతో భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు ముడుపుల పూజ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గోవింద గోవిందా నామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులు తెచ్చిన వివిధ రకాల పుష్పాలతో స్వామిని అలంకరించారు.