VSP: కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదలకు కొండంత అండగా నిలుస్తున్నాయని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం పెందుర్తి జోన్ 96వ వార్డు రాతి చెరువు ప్రాంతంలో లబ్ధిదారులకు ఆయన పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషిస్తూ పింఛన్దారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని కొనియాడారు.