RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్ కాలనీలో రూ.83 లక్షలతో నిర్మాణం చేపట్టిన నూతన సీసీ రోడ్ల పనులను కార్పోరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పర్యవేక్షించారు. రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత పాటించాలని సూచించారు. డివిజన్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.