WGL: పట్టణ కేంద్రంలోని వరంగల్-చింతలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఇవాళ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అబ్బన్నకుంట మైసమ్మ ఆలయం సమీపంలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.