MDK: తూప్రాన్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ఆస్పత్రి సేవలు, సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వైద్య పరీక్షలు చేయించారు.