సిరిసిల్ల పట్టణముతో పాటు పెద్దూరులో ఎరువులు, విత్తనాల దుకాణాలను, జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దుకాణంలోని ఎరువులు విత్తనాల స్టాకును పరిశీలించారు. నాణ్యమైన ఎరువులు విత్తనాలను అమ్మాలని సూచించారు. రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. ఇంఛార్జ్ కలెక్టర్ వెంట వ్యవసాయ అధికారి అఫ్టల్ బేగం ఉన్నారు.