VZM: జిల్లా ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేసే వారు కేవలం నోట్‌బుక్స్, పెన్లు, మొక్కలు ద్వారా మాత్రమే శుభాకాంక్షలు చెప్పాలని, బొకేలు, స్వీట్స్, పూల దండలు తీసుకురావద్దని ఫెసీ వర్గాలు తెలిపారు. ఉ.9 నుండి 11వరకు అందుబాటులో వుంటారన్నారు.