‘రాజాసాబ్’ కథను దర్శకుడు మారుతి రివీల్ చేశాడు. నాన్నమ్మను కాపాడుకునేందుకు మనవడు ఏం చేశాడనేది కథ అని తెలిపాడు. మొదట హర్రర్ కామెడీ కథగా అనుకున్నామని, కానీ చివరికి ఇది హర్రర్ ఫాంటసీ అయిందని అన్నాడు. ఈ స్క్రిప్ట్ రాయడానికి సంవత్సరం పట్టిందని, ఏడాదిన్నర పాటు మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్కు కూడా 7 నెలలు పట్టిందని చెప్పాడు. మొత్తం సినిమా 4 గంటలకుపైగా వచ్చిందన్నాడు.