VSP: వైజాగ్ కన్వెన్షన్స్ వేదికగా జనవరి 3, 5వ తేదీల్లో జరగనున్న వైజాగ్ ఫోటో ట్రేడ్ షో–2026 పోస్టర్ను ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ బుధవారం ఆవిష్కరించారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఫోటో ట్రేడ్ షోకు విశాఖ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. ఫోటోగ్రఫీ రంగంలోని సాంకేతిక మార్పులను ఈ ప్రదర్శన చాటి చెబుతుందని ఆయన పేర్కొన్నారు.