KDP: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి దువ్వాడ శ్రీదేవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, గర్భాలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ రంగ మండపంలో సేదతీరిన వారిని అర్చకులు సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.