GNTR: పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెంలో మంగళవారం కొమ్మూరు సామయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఒంటరిగా ఉంటున్న సామయ్య, మద్యానికి బానిసై మనస్థాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.