SDPT: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 39వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ తైక్వాండో ఛాంపియన్ షిప్లో సిద్దిపేట తైక్వాండో విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచి రెండు మెడల్స్ గెలుపొందారు. అండర్ 32 కేజీల విభాగంలో ఎల్. సామ్రాట్ బ్రాంజ్ మెడల్ అండర్ 35 కేజీల విభాగంలో ఎల్. రిషిక్ వర్మ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. కోచ్ శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.