KRNL: నిరుద్యోగ యువత www.ncs.gov.in వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఇవాళ జిల్లా ఉపాధి కల్పనాధికారిణి(డీఈవో) దీప్తి సూచించారు. మొబైల్ నంబర్, ఆధార్, మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం, కెరీర్ మార్గదర్శనం, జాబ్ మేళాల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సందేహాలుంటే జిల్లా ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.