AP: నంద్యాల జిల్లాలో ఈనెల 28న కుటుంబకలహాలతో పిల్లలను కాల్వలోకి తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మూడు రోజులపాటు SRBCలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గడివేముల మండలం మంచాలకట్ట SRBCలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. లక్ష్మి (23), వైష్ణవి (3) మృతదేహాలను NDRF బృందం వెలికి తీశాయి. మరో చిన్నారి సంగీత కోసం గాలింపు కొనసాగుతోంది.