VZM: వార్షిక తనిఖీల్లో భాగంగా కొత్తవలస ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని మంగళవారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్( విజయనగరం) పి.రామచంద్రరావు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న దస్త్రాలను తనిఖీ చేసి, రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే డిసెంబర్ 31, జనవరి 1 మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరుచుకోవచ్చన్నారు.