SS: పరిగి మండలంలో మంత్రి సవిత బుధవారం పర్యటించనున్నట్లు టీడీపీ కన్వీనర్ గోవింద రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు మోద పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి పంపిణీ చేస్తారు. అనంతరం మోద పంచాయతీ, కొండాపురంలో ఎన్టీఆర్ సృజల శుద్ధ త్రాగునీటి కేంద్రాలను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు మోద గ్రామంలో నూతన ఓవర్ హెడ్ ట్యాంకుకు మంత్రి భూమి పూజ చేస్తారన్నారు.