ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్ టైం ప్రైమ్ మినిస్టర్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తాజాగా ఇరువురు నేతలు ఫ్లోరిడాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్.. ఇజ్రాయెల్ను ప్రమాదకరమైన గాయం నుంచి నెతన్యాహు బయటకు తీసుకొచ్చారని తెలిపారు. ఆయన అద్భుతంగా పనిచేశారని అన్నారు. ఇజ్రాయెల్లో నెతన్యాహు లాంటి ప్రధాని లేకపోయుంటే.. ఇప్పుడు ఆ దేశం ఉనికిలో ఉండకపోయేదని తెలిపారు.