కడప జిల్లాకు 314 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని డీఆర్డీ ఏ ప్రాజెక్టు డైరెక్టరు డాక్టర్ జి.రాజ్యలక్ష్మి తెలిపారు. రెండు నెలల క్రితం వరకు ఎన్టీఆర్ భరోసా పింఛను పొందుతూ మరణించిన పింఛనుదారుడి భార్యకు నెలకు రూ.4వేలు వంతున డిసెంబరు 31 నుంచి పింఛను ఇస్తామని వివరించారు. వీరందరికీ సచివాలయ సిబ్బంది పింఛన్లు ఇస్తారని పేర్కొన్నారు.