TG: మంత్రి కొండా సురేఖ యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని 6A ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తాం. టెంపుల్ టూరిజం కోసం ప్రత్యేక ప్లాన్ అమలు చేస్తాం. ఆలయాల్లో భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నాం’ అని పేర్కొన్నారు.